Wednesday, May 4, 2016

రగిలే జ్వాల

రగిలే జ్వాల ఎద లయలోన
సహనం వరిస్తూ మనలో
అటూ ఇటూ ఎటూ లేని సహకారాలోచన
ఈసడించే రాజకీయాలతో ఈ నిశబ్దం ఇంకేన్నాలు

తరం తరం నిరంతరం  పరంపరముగా సాగునే
క్షణం క్షణం అహర్నిశం సజావుగా నిలుచునే
పదం పదం సమన్మయం  వారాలుగా రాలునే
మనం మనం ప్రజానికం అనేకమై పోదుమే

పరి పరి విధమున హాలాహలమై వేలుగుచునమే
ఒకరికిఒకరై వుండలేమ బ్రతుకునకు ఉపాయమై
కదిలి మరలే కాలముతో కలిసొచ్చే మార్పులతో

Saturday, December 26, 2015

ఎగసి రాకే ఓ ప్రేమ ప్రభంజనమ

మరుపైనది నా ఓ కల 
వెలుగు తోడైనది భళా 
దారి చూపుతున్న వెన్నల 
మనసు మాయమైనది మెరుపులా

ఊహలు పుట్టించే స్వప్నానివో

నా ఉనికి కి స్పందించే హృదయానివో 
నన్నే వెన్నంటి వుండే నా శ్వాస వో
నాలో విరహమును కలిగించే ప్రణయానివో

ఎవరివో నువ్వు ఇలా నా ఎదుట నిలిచి 

ఓ చిరునవుతో నా ఎదలో చేరావు 
భావ్యమా నీకు ఇలా నన్ను మరుగుచేయుట
నీ మాధుర్య భావముల కెరటాలతో

ఊరటనిచే ఊహలోకంలొ

విహరించే ఆ భావ కెరటములు
ఇంపు వొసిగి నా మదిని కవ్వించగా 
ఎద లయలో నాట్యము చేయసాగనే
విధ్యుత్ లతలా ప్రాకే ఈ ప్రెమ తరంగములు

ఎగసి రాకే ఓ ప్రేమ ప్రభంజనమ 

సోమసిల్లి వుండే ఈ చిరు గుండెలోన
పొందుపరచకు నాలోన ఓ మనసా  
మదిని పరుగులెత్తించే పరువాల రూపమును